26-10-2025 12:32:15 AM
ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల నిర్ణయంతో ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలకే మేలు జరుగుతుందని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్‌రెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు. ఇంటర్నల్ మార్కుల నిర్ణయాన్ని ఇంటర్ బోర్డు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల తల్లిదండ్రులు, నిపుణు లు, అధ్యాపకులతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైంది కాద న్నారు. ఇంటర్నల్స్ ప్రవేశపెట్టి పరీక్షలను నామమాత్రంగా చేసి, కార్పొరేట్ శక్తుల్లో పరీక్షల నిర్వహణను అప్పగించడమే అవుతుం దని విమర్శించారు. ఈ ఆనాలోచిత నిర్ణయాలను ఇంటర్ బోర్డు అధికారులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.