calender_icon.png 26 October, 2025 | 11:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాది ఉద్యోగ నామ ప్రభుత్వం

26-10-2025 12:31:02 AM

ఏడాదిన్నరలోనే 80 వేల కొలువులిచ్చాం

చిట్టచివరి మనిషి సంక్షేమమే లక్ష్యంగా ఎంపీడీవోలు పనిచేయాలి: మంత్రి సీతక్క

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాం తి): పదేళ్ల నిరీక్షణకు ఇప్పుడు ఫలితం దొరికింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మీలాంటి ప్రతిభావంతులకి ఉద్యోగావకాశాలు కల్పించింది. ఏడాదిన్నర కాలంలోనే 80 వేల ప్రభుత్వ కొలువులి చ్చాం. మాది ఉద్యోగ నామ ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వమే ప్రభుత్వ ఉద్యోగాల ప్రభు త్వం’ అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

శనివారం రాజేంద్రనగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ ఆడిటోరియంలో డీపీవో, ఎంపీడీవో శిక్షణ ముగిం పు కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. ‘ఇంతకాలం మీరు విద్యార్థు లు. నేటి నుంచి ఉన్నతాధికారులు. తెలంగా ణ రాష్ర్టంలో మొట్టమొదటి గ్రూప్ వన్ బ్యా చ్ మీది. అందుకే తెలంగాణ చరిత్రలో మీకు ప్రత్యేక స్థానం ఉంది’ అని సీతక్క అభినందించారు. 

తమ పదవులు కోల్పోయి నిరుద్యోగులుగా మారిన కొందరు రాజకీయ నాయ కులు ఇప్పుడు నిరుద్యోగ కార్డులు అంటూ డ్రామాలు ఆడుతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. నిరుద్యోగులను నిండా ముంచిన బీఆర్‌ఎస్ నాయకులను నిరుద్యోగులు నిలదీయాలన్నారు. గ్రామీణ అభివృద్ధిలో ఎంపీ డీవోల పాత్ర ఎంతో కీలకమన్నారు.

మండల స్థాయిలో అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అభివృద్ధి దిశగా నడిపించాల్సిన బాధ్యత ఎంపీడీవోలదేనని వివరించారు. చివరి మనిషికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరాలంటే మీరు ముందుండాలని, అసలైన అర్హులను గుర్తించి వారికి సహాయం చేయాలని కోరారు.