12-07-2025 12:02:08 AM
దర్యాప్తు కొనసాగిస్తున్న ఈడీ
లక్నో, జూలై 11: జమాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. అక్రమంగా మత మార్పిడులకు పాల్పడినట్టు చంగూర్ బాబాపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో మత మార్పిడి కోసం నేపాల్ ద్వారా ముస్లిం దేశాల నుంచి దాదాపు రూ. 300 కోట్ల నిధులను భారీగా సేకరించినట్టు తెలుస్తోంది. చంగూర్ బాబాను కరీముల్లా షా అని కూడా పిలుస్తున్నారు.
సైకలాజికల్ వ్యూహాలు, మతపరమైన చర్చలు, విదేశీ నిధులతో ఆర్థికంగా వెనుకబడిన వారిని మార్చే ప్రయత్నం చేశాడు. ఎక్కువగా ఎససీలను ఇస్లాంలోకి మళ్లించినట్టు తెలుస్తోంది. పీఎంఎల్‌ఏ చట్టం కింద ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది. చంగూర్ బాబాతో పాటు అతని సహచరులకు చెందిన 40 బ్యాంకు అకౌంట్లలో 106 కోట్లు ఉన్నట్టు గుర్తించారు. జూలై 5వ తేదీన లక్నోలో ఏటీఎస్ అధికారులు చంగూర్ బాబా, నీతు అలియాస్ నస్రీన్‌ను అదుపులోకి తీసుకున్నారు.