calender_icon.png 12 July, 2025 | 1:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెనడాలో కపిల్‌శర్మ కేఫ్‌పై కాల్పులు

12-07-2025 12:04:39 AM

  1. తన పనేనంటూ ఖలిస్థానీ ఉగ్రవాది హర్జీత్ సింగ్ ప్రకటన
  2. దాడిని ఖండించిన కేఫ్ యాజమాన్యం

సర్రే, జూలై 11: కెనడాలోని బ్రిటీష్ కొలంబియా సర్రేలో ఉన్న బాలీవుడ్ ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ కేఫ్ ‘ద క్యాప్స్ కేఫ్’ పై ఖలిస్థానీ ఉగ్రవాది హర్జీత్ సింగ్ లడ్డీ కాల్పులు జరిపాడు. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో వచ్చిన లడ్డీ కేఫ్‌పై 12 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు.

ప్రాణనష్టం జరగకపోయినా కానీ ఆస్తి నష్టం మాత్రం జరిగింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు సర్రే పోలీసులు ప్రకటించారు. ‘సిక్కు సంప్రదాయ ఆచారాలను, నిహంగ్ హుందాతనాన్ని దెబ్బతీశారు. హాస్యం పేరిట ఏ మతాన్ని కించపరచకూడదు. అందుకే కపిల్ శర్మ కేఫ్‌పై కాల్పులు జరిపాం’ అని సోషల్ మీడియాలో విడుదలైన లేఖ చర్చనీయాంశమైంది.

హింసను ఖండిస్తున్నాం.. 

ఈ దాడిపై యజమాని కపిల్ శర్మ స్పం దించారు. ‘రుచికరమైన కాఫీ, స్నేహపూర్వక సంభాషణలతో కస్టమర్లకు ఆనందాన్ని ప ంచాలనే ఆశతో కాప్స్ కేఫ్‌ను ప్రారంభి ం చాం. ఇక్కడ హింస చోటు చేసుకోవడం బా ధాకరం.’ అని పేర్కొన్నారు. హింసకు వ్య తిరేకంగా నిలబడాలని పిలుపునిచ్చారు. కా ప్స్ కేఫ్ సంస్థ దాడిని తీవ్రంగా ఖండించింది.

ఎవరీ హర్జీత్ సింగ్?

కెనడాలో కపిల్ శర్మ కేఫ్ కాల్పుల ఘటన తన పనేనంటూ ఖలిస్థానీ ఉగ్రవాది హర్జిత్ సింగ్ లడ్డీ ఒక ప్రకటన విడుదల చేశాడు. ఖలిస్థానీ సంస్థ బబ్బార్ ఖల్సా ఇంటర్నేషనల్ ఉగ్ర సంస్థతో హర్జీత్ సింగ్‌కు సత్ససంబంధాలున్నాయి. కొన్నేళ్లుగా అతడు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు.

పంజాబ్‌లోని నంగల్ ప్రాంతంలో జూన్ 2024లో జరిగిన విశ్వహిందూ పరిషత్ నేత వికాస్ ప్రభాకర్ హత్యలో లడ్డీ ప్రధాని నిందితుల్లో ఒకడిగా ఉన్నాడు. ఈ కేసులో కుల్బీర్ సింగ్ అలియాస్ సిద్ధూ మరికొందరు నిందితులుగా ఉన్నారు. భారత్‌లో లడ్డీపై రూ. 10 లక్షల రివార్డు ఉంది.