24-01-2026 06:36:32 PM
6కొత్త గేట్ వాల్ ఏర్పాటు, పైపులైన్ కు మరమత్తులు చేయించిన సర్పంచ్ సంపత్
ముత్తారం,(విజయక్రాంతి): మండలంలోని పారుపల్లి గ్రామంలో ఇక తాగునీటి కష్టాలకు గ్రామ సర్పంచ్ చొప్పరి సంపత్ చెక్ పెట్టాడు. గత కొన్ని ఏండ్లు గా గ్రామంలో పైపులెన్ లీకేజ్ లతో పాటు గేటు వాల్స్ సరిగలేక గ్రామంలో తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు ఉండేది. ప్రజల ఇబ్బందులు గమనించిన సర్పంచ్ శనివారం 6 కొత్త గేట్ వాల్స్ ఏర్పాటు చేసి, పైప్ లైన్ కు మరమ్మత్తులు చేయించారు. దీంతో గ్రామంలో తాగునీటి ఇబ్బందులు తీరాయని, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.