24-01-2026 06:24:40 PM
పైళ్లను తనిఖీ చేస్తున్న అధికారులు
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్లోని పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో ఫైళ్లను తనిఖీ చేయడంతో పాటు సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. కలెక్టరేట్లో ఏసీబీ అధికారు లు కార్యాలయ సిబ్బందిని ప్రశ్నిస్తూ వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.