24-01-2026 07:34:45 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలోని ప్రైమరీ, హై స్కూల్‌లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పిల్లలకు “రాజ్యాంగం అంటే ఏంటి?”, “రాజ్యాంగం సాధించిన విధానం”, “అప్పటి ఇబ్బందులను ఎవరు ఎలా ఎదుర్కొన్నారు” వంటి అంశాలపై అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యం. అలాగే రాజ్యాంగం ద్వారా మనకు అందుతున్న ప్రయోజనాలను వివరించారు. కనీసం అక్షరాలు నేర్చుకుంటున్న చిన్నారులు కూడా రాజ్యాంగ పరిరక్షణ గురించి తెలుసుకోవాలని సంఘం ప్రయత్నించింది.