24-01-2026 07:31:54 PM
వాంకిడి,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని పీఎం జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో శనివారం జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో భాగంగా బాలికల సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఆటల పోటీలు, పాటల పోటీలు, రంగవల్లుల పోటీలు, ఉపన్యాసాలు, నృత్య పోటీలు నిర్వహించారు. అలాగే చేతివృత్తుల ద్వారా నైపుణ్యాభివృద్ధి కల్పించే కార్యక్రమాలు చేపట్టారు.
మహిళా సాధికారతతో పాటు బాలికల హక్కులు, బాధ్యత లపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రధా నోపాధ్యాయుడు సంతోష్‌కు మార్ పాల్గొని బాలికలు విద్య తో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. మహిళా ఉపాధ్యాయులు మమత, శోభారాణి, శైలజ, అరుంధతి నాగరాణి, స్వప్న, అలివేణి, నుజహాత్, కవిత, రమాదేవి, సరిత, ఉపాధ్యా యులు విద్యార్థులు తదిత రులు పాల్గొన్నారు.