calender_icon.png 21 November, 2025 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జన విజ్ఞాన టాలెంట్ టెస్ట్‌లో సూది రెడ్డి స్కూల్ విద్యార్థులు ప్రభంజనం

21-11-2025 10:48:23 PM

భద్రాచలం,(విజయ క్రాంతి): జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నాడు దుమ్ముగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్ లో జరిగిన మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ లో సూది రెడ్డి నాగిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సాపురం పాఠశాల నుండి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి జిల్లా స్థాయికి ఎంపిక కావడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం నుంచి సోయం సానియా, రాచకొండ మహిత, పూజారి దేవి ప్రియ మరియు తెలుగు మీడియం నుండి పెనుగొండ రక్షిత, కొమరం ప్రశాంత్, పొడిశెట్టి కార్తీక్ ఎంపిక కావటం జరిగింది.

ఈ విద్యార్థులు దుమ్ముగూడెం మండలం తరపున నవంబర్ 28న కొత్తగూడెంలో జరిగే జిల్లాస్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ లో పాల్గొంటారు. ఎంపిక కాబడిన ఈ విద్యార్థులను మండల విద్యాశాఖ అధికారి సమ్మయ్య  మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సాపురం ప్రధానోపాధ్యాయులు బెక్కంటి శ్రీనివాసరావు చేతులు మీదుగా ప్రశంస పత్రాలు విద్యార్థులు అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బేకంట శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ విజయానికి కారుకులైన పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. ఉపాధ్యాయులందరూ విజయం సాధించిన  విద్యార్థులను అభినందించడం జరిగింది