calender_icon.png 21 November, 2025 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్యామ్, కాలువల మరమ్మత్తుల పనులు త్వరిత గతిన పూర్తి చేయండి

21-11-2025 10:45:09 PM

ఇరిగేషన్ శాఖ-l అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు

భద్రాచలం,(విజయక్రాంతి): తాలిపేరు ప్రాజెక్టు డ్యాం, కాలువలపై అగ్రిమెంట్ అయిన పనులుచేయించుటకు, రెండవ పంటకు నీటి పంపిణీ అంశాల చర్చించే నిమిత్తం 3వ జోన్ ఆయకట్టు రైతులతో ఈ నెల 13వ తేదీన నర్సాపురం రైతు వేదికలో రైతులు, ఇరిగేషన్ శాఖ అధికారులతో భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించిన విషయం విధితమే. ఈ తరుణంలో శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చించారు.

ప్రస్తుతం ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటిని అన్ని జోన్లు (జోన్ 1,2,3) లో ప్రస్తుతం ఉన్న ఆరుతడి పంటలకు జనవరి నెల చివరి వరకు నీటిని అందించి తదనంతరం డ్యామ్, కాలువల మరమ్మత్తుల పనులు త్వరిత గతిన చేయించమని ఆదేశించారు. అదేవిధంగా వచ్చే సంవత్సరం రెండవ పంటకు (రబీ) 3వ జోన్ గల పంటలకు మీరు అందించే విధంగా నిర్ణయించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ ఎస్.ఏ. జానీ, డీఈఈలు తిరుపతి, మధుసూదన్ రావు, రైతులు వీ.కోటేశ్వరరావు, లంక అబ్బులు, రావులపల్లి రవికుమార్, సీపీఐ నాయకులు, తాలిపేరు ప్రాజెక్టు సిబ్బంది, పాల్గొన్నారు.