21-11-2025 10:52:22 PM
భద్రాచలం,(విజయక్రాంతి): ఐఏఎస్ శిక్షణలో భాగంగా భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన సౌరబ్ శర్మ భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు గ్రూప్స్ మెయిన్స్ సంబంధించిన కోచింగ్ పుస్తకాలను అందించారు. ఇటీవల భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సబ్-కలెక్టర్ మ్రిణాళి శ్రేష్ఠను జూనియర్ కళాశాల విద్యార్థులు IIT-JEE, NEET, CLAT మరియు హోటల్ మేనేజ్‌మెంట్ ప్రవేశ పరీక్షలతో సహా వివిధ పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి రిఫరెన్స్ పుస్తకాల కోసం అభ్యర్థించారని, ఈ అభ్యర్థనపై వెంటనే చర్య తీసుకుని, పుస్తకాలను ఏర్పాటు చేసి భద్రాచలం సబ్-కలెక్టర్ కార్యాలయంలో విద్యార్థులకు రిఫరెన్స్ పుస్తకాలను నా చేతుల మీదుగా అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
ఈ సందర్భంగా శిక్షణ సౌరబ్ శర్మ విద్యార్థులతో సంభాషించి IIT-JEE, ఇతర పరీక్షలకు సన్నాహక వ్యూహాలపై మార్గదర్శకత్వం అందించారు, క్రమశిక్షణతో కూడిన అధ్యయన పద్ధతులను అవలంబించమని, అందుబాటులో ఉన్న విద్యా వనరులను సద్వినియోగం చేసుకోవాలని, భద్రాచలం సబ్-డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ విద్యా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, విద్యార్థులు వారి విద్యా, కెరీర్ లక్ష్యాలలో రాణించడానికి అవసరమైన మద్దతును సబ్ కలెక్టర్ చొరవ చూపుతున్నందున విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.