calender_icon.png 26 October, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్ఫోర్స్ లో ఘనంగా కెమిస్ట్రీ వీక్ సంబరాలు

25-10-2025 05:56:05 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో శనివారం కెమిస్ట్రీ వీక్ సంబరాలను ఘనంగా నిర్వహించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యా రంగంలో రసాయన శాస్త్రానికి చాలా విశిష్టత ఉన్నదని, రసాయన శాస్త్రం ద్వారా అనేక విషయాలను తెలుసుకోగలుగుతామని, తద్వారా దైనందిన జీవిత కార్యకలాపాలను సైతం చాలా సులభంగా కొనసాగించగలుగుతామని అన్నారు. డాక్టర్ కెప్టెన్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ అనువుల మధ్య బంధాలను తెలిపేది రసాయన శాస్త్రమని,  వివిధ ఆకృతులను సైతం రసాయన శాస్త్రంలో మనం తెలుసుకుంటామని చాలా ఉత్సాహపరిచే విషయాలలో రసాయన శాస్త్రం ఒకటి అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.