25-10-2025 05:59:21 PM
డిచ్పల్లి (విజయక్రాంతి): డిచ్పల్లి మండలం ధర్మారంలో ఓ కొరియర్ కంటైనర్ వాహనం డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి కొరియర్ కంటైనర్ పార్సిళ్లతో నిజామాబాద్‌కు వస్తుండగా శనివారం ఉదయం 5 గంటల సమీపములో బోల్తా పడింది. డ్రైవర్ నిద్రలో ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెల్సింది. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెనుకనుండి ఎ వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు వాపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని పరిశీలించారు. తీవ్రగాయలపాలయినా డ్రైవర్ ను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.