calender_icon.png 23 August, 2025 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచిర్యాల ఎంఎల్ఏ ఆరోగ్యం కోసం చెన్నూర్ నియోజక వర్గ నాయకుల పూజలు

23-08-2025 06:15:41 PM

మందమర్రి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంచిర్యాల ఎంఎల్ఏ కొక్కిరాల ప్రేం సాగర్ రావు మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరుకుంటూ చెన్నూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నూర్ నియోజక వర్గ పీసీసీ సభ్యులు నూకల రమేష్ మాట్లాడుతూ... మంచిర్యాల ఎంఎల్ఏ నెల రోజులుగా ఆరోగ్యం బాగు లేనందున ప్రజల మధ్యకు రాలేకపోయారని, ఆయురారోగ్యాలతో బడుగు, బలహీన వర్గాలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. చెన్నూర్ నియోజక వర్గ  కాంగ్రెస్ పార్టీ తరుపున పీఎస్ఆర్ ఎల్లప్పుడూ  నిండు నూరేండ్లు ఆరోగ్యంగా ఉండి ప్రజలకు సేవ చెయాలని కోరుతున్నామన్నారు.