calender_icon.png 23 August, 2025 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయన ఒక కమిషన్ల కార్పొరేటర్...

23-08-2025 06:11:55 PM

గోకుల్ నగర్ కాలనీ నీ కబ్జా కోరుల కబంద హస్తాల నుండి కాపాడండి

కాంటాక్ట్ రవీంద్ర సాగర్

ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ కార్పొరేటర్ కమిషన్లు తీసుకొని కబ్జాదారులకు సహకరిస్తున్నారని  గోకుల్ నగర్ నివాసి కాంట్రాక్టర్ రవీంద్ర సాగర్ ఆరోపించారు. మల్లాపూర్ గోకుల్ నగర్ లో కొందరు కబ్జాలకు పాల్పడుతూ  నకిలీ  పత్రాలు సృష్టించి స్థలాలను  అమ్మకాలు చేపట్టి ప్రజలను మోసం చేస్తున్నారని వీరికి స్థానిక కార్పొరేటర్ సహకరిస్తూ  కమిషన్లు తీసుకుంటున్నారని  ఆయన ఆరోపించారు. మల్లాపూర్ గోకుల్ నగర్ లొ 1968లో  34 ఎకరాలలో 480 ప్లాట్ లతో లేఔట్ చేయడం జరిగిందన్నారు. చాలామంది ప్రజలు ఆ ప్లాన్ అప్పుడే కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అప్పట్లో ఆన్లైన్లో వ్యవస్థ లేకపోవడంతో  కొన్ని ప్లాట్లు యజమానిదారులు సుదూర ప్రాంతాల నుండి  వచ్చిన ప్రజలు ఇక్కడ కొనుగోలు అందులో 30 ప్లాట్లు వరకు మిగిలిపోవడం జరిగిందన్నారు.

ఆన్లైన్ లేకపోయినా గమనించిన స్థానికన్నంగా ఉండే వ్యక్తులు  ఈ ప్లాట్ ల పై కన్ను వేసి  నకిలీ దస్తావేజులు సృష్టించి ప్లాట్లను విక్రయిస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తూ కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్లు రవీంద్ర సాగర్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఆవుల చందు అనే వ్యక్తి రెండు కోట్ల రూపాయలు పెట్టి  ప్లాట్ ను కొనుగోలు చేయగా  అట్టి   ప్లాటు ను నకిలీ జిపిఏ సృష్టించి కబ్జాదారులు మరొకరికి అమ్మకాలు చేపట్టారని అతను స్థానిక పోలీస్ స్టేషన్ మరియు రెవెన్యూ అధికారుల దగ్గరికి పలుకుబడు ఉపయోగించి  ఇబ్బందులు గురి చేస్తున్నారని  ఆయన ఆరోపించారు. దీనికి స్థానిక కార్పొరేటర్  సహకరిస్తూ కబ్జాదారులకు వతాసు పలుకుతూ ఆవుల చందు ఇబ్బందు గురి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

సొంత ఇంటి కలగా రూపాయి రూపాయి కూడా పెట్టి  ప్లాటు కొనుగోలు చేసి   ఇల్లు కట్టుకోవాలి అనుకునే  మధ్యతరగతి కుటుంబాలను అన్యాయం చేస్తూ కోట్ల రూపాయలను   కూడగడుతున్నారని నకిలీ జీపీఏ ను సృష్టించి ఇబ్బందులు గురి చేస్తున్నారని తిరిగి డబ్బులు ఏం చేస్తావో చేసుకో అంటూ  బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులు రెవెన్యూ పోలీస్ అధికారులు కబ్జాదారులు చెప్పే తప్పుడు సమాచారం నేను నమ్ముకుంటూ న్యాయబద్ధంగా ప్లాట్లను కొనుగోలు చేసిన యజమానులకు సహకరియకుండా కబ్జాదారులకు సహకరించడమేంటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పెద్దలు చెప్తున్న ప్రజాపాలన అంటుంటే స్థానికంగా ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులు తన అనుచరులతో ఇల్లు నిర్మానించుకుందాం అంటే డబ్బులు ఇవ్వని వేధింపులు గురి చేస్తున్నారని ఆయన తెలిపారు.

కబ్జాదారుల  చెర నుండి విముక్తి పొందేందుకు కోర్టుకెళ్లి ఈ యొక్క ఫ్లాట్ నాది అని చెప్పి కోర్టు ఉత్తర్వులు తెచ్చుకున్నప్పటికీ కూడా పలుకుబడి ఉపయోగించి స్థానిక పోలీసు అధికారులతో అధికారులతో యజమానుని వేధిస్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు  స్పందించి గోకుల్ నగర్ కాలనీ  కబ్జా కోర్ల కబందస్తాల నుండి కాపాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బాధితుడు ఆవుల చందు శ్రీనివాస్ సింగిశెట్టి బిచ్చన్న పాల్గొన్నారు. రవీంద్ర సాగర్ ఆరోపణలో వాస్తవం లేదు.. ఎక్కడ కమిషన్లు తీసుకున్నాను  నిరూపించాలి. కార్పొరేటర్  పన్నాల దేవేందర్ రెడ్డి గోకుల్ నగర్ కాలనీ సంబంధించి ఏవైతే చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే    దేనికైనా సిద్ధమని  కార్పొరేటర్  దేవేందర్ రెడ్డి అన్నారు.

కబ్జాలు నకిలీ   డాక్యుమెంట్లు సృష్టించి బ్లాక్మెయిలింగ్ పాల్పడే వ్యక్తి రవీంద్ర సాగర్ అని అలాంటి పనులు చేయడం మాకు రాదని దేవేందర్ రెడ్డి అన్నారు. అసైన్ ల్యాండ్ కబ్జా చేసి  దొంగ డాక్యుమెంట్లు సృష్టించింది రవీంద్ర సాగరేనని  దీనిని వ్యతిరేకించినందుకే  బిజెపి పార్టీలోకి వెళ్లి  టిఆర్ఎస్ పార్టీ నేతగా ఉన్న నన్ను  విమర్శించడం సరికాదన్నారు. ఆరోపణలు చేసే ముందు  నిజానిజాలు తెలుసుకోవాలని మాట్లాడారన్నారు. తనపై చేసిన ఆరోపణలకు న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు.