calender_icon.png 20 September, 2025 | 5:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేయూత పెన్షన్ దారుల గ్రామ పంచాయతీ ముట్టడి

20-09-2025 03:17:27 PM

చిలుకూరు: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు చేయూత పెన్షన్ దారుల పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ శనివారం చిలుకూరు మండల కేంద్రంలోని  వికలాంగుల హక్కుల పోరాట సమితి చేయూత పింఛన్దారుల ఎమ్మార్పీఎస్(MRPS) ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేయూత పెన్షన్ దారులు ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొని, గ్రామపంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి కోటేష్ మాదిగ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు పెన్షన్లు పెంచాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మల్లెపంగు సూరిబాబు మాదిగ, వికలాంగులు, చేయూత పెన్షన్ దారులు పాల్గొన్నారు.