20-09-2025 04:47:49 PM
జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్..
వనపర్తి (విజయక్రాంతి): వర్షాకాలంలో, చలికాలంలో హోంగార్డ్స్ అధికారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా విధుల నిర్వర్తించేందుకు ఉలెన్ జాకెట్స్, రెయిన్ కోట్స్ అందజేస్తున్నామని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలో పని చేస్తున్న హోంగార్డుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ డిజిపి కార్యాలయం నుండి వచ్చిన ఉలెన్ జాకెట్స్, రెయిన్ కోట్స్ ను హోంగార్డ్స్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్స్ పోలీసు శాఖలో అంతర్గత భాగమని, పోలీసులతో పాటే నిరంతరం తమ సేవలను అందిస్తున్నారన్నారు. వర్షాకాలంలో, చలికాలంలో హోంగార్డ్స్ కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా విధుల నిర్వర్తించేందుకు ఉలెన్ జాకెట్స్ & రెయిన్ కోట్స్ అందజేస్తున్నామని తెలిపారు.
ప్రతి పోలీస్టేషన్లో పోలీసు సిబ్బందితో పాటు విధులు నిర్వహిస్తున్నారని, క్లిష్ట పరిస్థితులలో కూడా వివిధ బందోబస్తు విధుల్లో చాలా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. హోంగార్డ్స్ అధికారులు, సిబ్బంది ఎవరికైన సమస్యలు ఉంటే నేరుగా తనని సంప్రదించవచ్చని, రాష్ట్ర పోలీసుశాఖ సిబ్బంది కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పీ, వెంకటేశ్వరరావు, వనపర్తి సీఐ, కృష్ణయ్య, కొత్తకోట సీఐ, రాంబాబు, ఆత్మకూరు సీఐ శివకుమార్, సిసిఎస్ సీఐ, రవిపాల్, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్, హోం గాడ్స్ సిబ్బంది పాల్గొన్నారు.