20-09-2025 03:21:45 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 2022-2023లో పదవ తరగతి చదివిన విద్యార్థిని మేరుగు అక్షయ నీట్ లో 2364 మెరిట్ ర్యాంక్ సాధించి నర్సంపేటలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు సాధించింది. మేరుగు స్వామి-సంతోషలకు ముగ్గురు అమ్మాయిలు. అక్షయ రెండవ అమ్మాయి.. నాన్న రైస్ మిల్లు ఆపరేటర్ గా పనిచేస్తుండగా తల్లి గృహిణి. అమ్మ నాన్న ఆశయాలకు అనుగుణంగా కష్టపడి అక్షయ చదివి ఎంబిబిఎస్ లో నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించింది. అక్షయ సీటు సాధించడం పట్ల స్కూల్ హెడమాస్టర్, ఎంఈఓ, టీచర్ లు సంతోషించి అక్షయను అభినందించారు.
అక్షయ ఎంబిబిఎస్ లో సీటు సాధించడం పట్ల తండ్రి స్వామి మాట్లాడుతూ.. అక్షయ కష్టపడి చదివి మా కల నేరవిరచ్చిందని మాకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు. అలాగే అదే పాఠశాల లో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్న మగ్గిడి విజయరావు సార్ అక్షయ విజయం పట్ల ఆనందించి తన విద్యార్థిని అక్షయ ఎంబిబిఎస్ పూర్తి అయ్యేవరకు ఫీజు అంతా తానే చెల్లిస్థానని, స్వచ్చందంగా అమ్మాయిని చదివించడానికి ముందుకు వచ్చి మాకు అండగా నిలిచాడని విజయరావు సార్ కు మా కుటుంబం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు చెపుతున్నామని అక్షయ తండ్రి స్వామి తెలిపారు.