calender_icon.png 20 September, 2025 | 6:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొర్రెల కాపరులపై అటవీ అధికారుల వేధింపులు నిలిపి వేయాలి

20-09-2025 04:51:29 PM

మందమర్రి (విజయక్రాంతి): చెన్నూరు నియోజకవర్గంలో గొర్రెల మేకల కాపరులపై అటవీ అధికారుల వేధింపులు, దాడులు నిలిపివేయాలని కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు గుంట శ్రీశైలం కోరారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా గొర్రెలు మేకలను మేపేందుకు అటవీ ప్రాంతంలోకి అనుమతులు ఇవ్వాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అడవిలోకి అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో గొర్రెలు మేకలను తినేందుకు మేత కరువవ్వడమే కాకుండా గోర్లు, మేకల కాపరీ వృత్తిదారులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని అవేదన వ్యక్తం చేశారు.

వారి ఉపాధిని దృష్టిలో పెట్టుకొని అటవీ అధికారుల వేధింపులు నిలిపివేసేలా చర్యలు చేపట్టి వారికి జీవనోపాధి కల్పించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి నియోజకవర్గంలో గొర్రెలు, మేకల కాపరుల వృత్తి దాడులపై అటవీ అధికారులు దాడులు నిలిపి వేసి గొర్లు, మేకలను అడవిలో మేతకు అనుమతించేలా చర్యలు చేపట్టాలని జిల్లా అటవీ అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. అలాగే జిల్లాలో కురుమ సంఘ వన నిర్మాణానికి స్థలం మంజూరు చేయాలని మంత్రి కోరగా జిల్లా కలెక్టర్ తో చర్చించి స్థలం మంజూరుకి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మంద తిరుమల్ రెడ్డి, వెల్ది సాయి పాల్గొన్నారు.