calender_icon.png 20 September, 2025 | 5:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలకు వరం.. సీఎం సహాయనిధి

20-09-2025 03:13:23 PM

- మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాసరి లింగారావు

కొండపాక: సీఎం సహాయనిధి చెక్కులను శనివారం పంపిణీ చేశారు. కొండపాక మండలంలోని రవీంద్రనగర్, వెలికట్ట, దుద్దెడ, జప్తి నాచారం గ్రామాలలోని ప్రజలకు ఆర్థికంగా వెనుకబడిన, అప్పులు తెచ్చుకొని హాస్పిటల్ లో చికిత్స చేసుకుంటున్న నిరుపేదలకు, ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, వారి కుటుంబాల్లో మనోధైర్యం నింపడానికి తోడ్పడుతుందని కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాసవి లింగారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ పెరుగు తిరుపతి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.