28-12-2025 01:05:26 PM
సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం నూతన గ్రామపంచాయతీ పాలకవర్గం సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి వార్డు సభ్యుల ఆధ్వర్యంలో మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో భవిష్యత్తు నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆదివారం రజకుల ముత్యాలమ్మ గుడి నుండి సుమారు ఒక కిలోమీటర్ మేర నూతన పైప్ లైన్ ప్రారంభించడం జరిగింది . దీనితో గెలిచిన 15 రోజులలోపే గ్రామము లో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతుండముతో ఐదు సంవత్సరాలలోపే, ఆదర్శ గ్రామంగా ఏర్పడుతుందని గ్రామస్తులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.