25-09-2025 05:29:04 PM
నకిరేకల్,(విజయక్రాంతి): ఈనెల 27న కట్టంగూరు మండల కేంద్రంలోని సాందీపని స్కూల్లో జరిగే కల్లుగీత కార్మిక సంఘం నాలుగోవ మండల మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రాచకొండ వెంకన్న గౌడ్ కోరారు గురువారం కట్టంగూరు మండల కేంద్రంలో మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కల్లుగీత సొసైటీలు టీఎఫ్టీఎ గ్రామాలకు మద్యం షాపులలో రిజర్వేషన్ కల్పించాలని, ఇచ్చిన మాట ప్రకారం 25 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గౌడులకు 15 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెచ్చిన మద్యం పాలసీ వల్ల గీతా కార్మికులకు ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. కల్లుగీత సొసైటీలకు టీఎస్సీ గ్రామాలకు మాత్రమే ఇవ్వాలన్నారు. అదేవిధంగా 25 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మద్యం షాపులలో రిజర్వేషన్ పెంచితే ప్రభుత్వానికి లాభం తప్ప నష్టం ఉండదన్నారు. కల్లుగీత సొసైటీలకు టిఎష్టి గ్రామాలకు ఇచ్చినట్లయితే ఆర్థికంగా గీత కార్మికులకు ఉపయోగంజరుగుతుందన్నారు.