11-08-2025 06:28:43 PM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్..
కామారెడ్డి (విజయక్రాంతి): ప్రభుత్వ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో ప్రవేశం పొంది ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్(District Collector Ashish Sangwan) అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్, ఐటిఐ కళాశాలల ప్రిన్సిపాల్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో అడ్మిషన్ల పెంపుపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ మాట్లాడుతూ... గ్రామస్థాయిలలో పంచాయతీ కార్యదర్శుల ద్వారా గ్రామస్థాయి అధికారుల సహకారంతో విద్యార్థులకు ఏటిసి కేదార్ల గురించి తెలియజేసి వాటిలో చేరేలా ప్రోత్సహించాలని జిల్లా పంచాయతీ అధికారి కాశ మురళిని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి, శిక్షణ శాఖా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఐటిఐ/ఆడ్వాన్సడ్ టెక్నాలజీ సెంటర్ బిచ్కుంద, తాడ్వాయి, ఎల్లారెడ్డిలోని ఆడ్వాన్సడ్ టెక్నాలజీ సెంటర్ లలో వాక్ ఇన్ అడ్మిషన్ల ప్రారంభమాయ్యాయని తెలిపారు.
విద్యార్థులు 06 ఆగస్ట్ నుండి 28 ఆగస్టు 2025 వరకు ప్రతిరోజూ ఉదయం 11:00 గం. ల నుండి మధ్యాహ్నం 01:00 వరకు మీ యొక్క ఒరిజినల్ పత్రాలతో ఆయా ఐటిఐ. ఏటిసిలకు హాజరై సిటు పొందగలరని అన్నారు.10 వ తరగతిఉత్తీర్ణులు అయినవారు, వర్చ్యువల్ ఎనాలిసిస్ అండ్ దిసిజ్ఞేర,సి యాన్ సి మేశినింగ్ టెక్నీషియన్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మనుఫచ్తురింగ్ టెక్నిశియన్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ టెక్నిశియన్,06 మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన డాక్యూమెంట్లతో ఎస్. ఎస్. సి. సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ, స్టడీ సర్టిఫికెట్స్, ఆధార్, ఫోటోలు, నాలుగు సెట్లు జిరాక్స్ కాపీలు తీసుకోని సంబంధిత ఐటిఐలకు నేరుగా హాజరు అయ్యి అడ్మిషన్ పొందవచ్చని అన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సిహెచ్. ప్రభుదాస్, ప్రిన్సిపల్, కన్వీనర్ జి. ప్రమోద్ , తాడ్వాయి ప్రిన్సిపల్ ఎఫ్ ఏ సి జి. కనకయ్య, ఈ సమావేశంలో పాల్గొన్నారు.