calender_icon.png 11 August, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అపరిచితుల వ్యక్తుల మాటలు నమ్మవద్దు

11-08-2025 06:25:54 PM

చదువే ముఖ్యం చదువుకుంటేనే విలువ

పేదరికానికి చదువు అడ్డు కాదు  

సైబర్ నేరాల పట్ల మీరు మీ కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలి 

సిద్దిపేట రూరల్ ఎస్ఐ రాజేష్ 

సిద్దిపేట రూరల్: రాఘవాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు  మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, షీటీమ్ నిర్వహిస్తున్న విధుల గురించి, షీటీమ్ ద్వారా ఎలా రక్షణ పొందొచ్చు అనే అంశాల గురించి, ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలు,నూతన చట్టాల గురించి,అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్, మాటలు నమ్మవద్దు, సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుందని సిద్దిపేట రూరల్ ఎస్ఐ రాజేష్(SI Rajesh) అన్నారు. మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం మహిళల భద్రత మా ముఖ్య బాద్యత. చదువుకునే సమయములో చెడు అలవాట్లకు బానిస కావొద్దు అన్నారు, ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని తెలిపారు.

డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలపై  అప్రమత్తంగా ఉండాలన్నారు. చదువుకోవడం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని అన్నారు. పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని మనసులో పెట్టుకొని చదువుపై శ్రద్ధ వహించాలని సామాజిక రుగ్మతల గురించి సెల్ఫోన్ కు ఎంత దూరం ఉంటే అంత మంచిది  సెల్ ఫోన్ వల్ల ఎంత మంచి ఉందో అంత చెడు ఉంది దానికి అలవాటు పడి బానిసలు కావద్దు విద్యార్థి దశ చాలా కీలక  కష్టపడే తత్వం కష్టపడి చదువుకోవడం చాలా ముఖ్యమని మహిళలను ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మరియు అవహేళనగా మాట్లాడిన వెంటనే డయల్ 100 లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ షీటీమ్ నెంబర్ 8712667434 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని  సమాచార అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. మరియు నూతన చట్టాల గురించి నూతన చట్టాలలో మహిళల రక్షణకు  పెద్దపీట వేయడం జరిగిందని అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ మంజుభవాని, మరియు ఉపాధ్యాయులు, సిద్దిపేట షీటీమ్ బృందం ఏఎస్ఐ కిషన్, మహిళ కానిస్టేబుల్ రజని  కానిస్టేబుళ్లు లక్ష్మీనారాయణ, ప్రవీణ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ హెడ్ కానిస్టేబుల్ మురళి, కానిస్టేబుల్ కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.