calender_icon.png 8 November, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్సాహంగా బాలల దినోత్సవ వేడుకలు

08-11-2025 12:00:00 AM

సెంట్ పాల్స్ హైస్కూల్‌లో ప్రారంభం

కరీంనగర్, నవంబర్ 7(విజయక్రాంతి): కరీంనగర్‌లోని వావిలాలపల్లిలోని సెంట్ పాల్స్ హైస్కూల్‌లో చిల్డ్రన్స్ డే కార్నివల్ వేడుకలు శుక్రవారం నుంచి ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు ఈ వేడుకలను స్కూల్ యాజమాన్యం ఘనంగా నిర్వహించనుంది. కార్యక్రమాన్ని చైర్మన్ రాజ్‌కుమార్, ప్రిన్సిపాల్ లీనా ప్రియదర్శిని బెలూన్ రిలీజ్, పోస్టర్ ఆవిష్కరణతో ప్రారంభించారు.

విద్యార్థులు పాల్గొన్న చిల్డ్రన్ పరేడ్ ఆకర్షణీయంగా సాగింది. ఈ వారం మొత్తం డ్రాయింగ్, స్పెల్ బీ, క్విజ్, సింగింగ్ వంటి పలు పోటీలు నిర్వహించబడనున్నాయి. ప్రిన్సిపాల్ లీనా ప్రియదర్శిని మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఈ వేడుకలు ఈ నెల 14న ముగుస్తాయి.