20-09-2025 08:14:45 PM
చిలుకూరు: కేసుల సమర్థ నిర్వహణలో చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి జిల్లా ఎస్పీ చేతులమీదుగా రివార్డు అందుకున్నారు. చిలుకూరు మండల పరిధిలోని గ్రామాలలో కేసుల సమర్థ నిర్వహణ త్వరగా కేసులు పరిశోధన చేసినందుకుగాను, చిలుకూరు మండల ఎస్సై సురేష్ రెడ్డికి సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ రివార్డు అందించడం జరిగింది. ప్రజలకు సత్వర న్యాయం జరిగేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. విధి నిర్వహణలో సహకరించిన అధికారులకు స్టేషన్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అవార్డు అందుకున్న ఎస్ఐ సురేష్ రెడ్డికి పోలీసులు సిబ్బందితో పాటు స్థానికులు అభినందనలు తెలిపారు.