20-09-2025 08:16:24 PM
కోదాడ: విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పట్టణ సీఐ శివశంకర్ కు రివార్డు లభించింది. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ నరసింహన్ చేతుల మీదుగా పట్టణ సీఐ శివశంకర్ రివార్డు అందుకున్నారు. కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా చొరవ చూపడం, క్రమశిక్షణతో విధులు నిర్వహించడంతో ఈ రివార్డు లభించింది.