మళ్లీ చైనా దురాగతం!

26-04-2024 01:34:29 AM

n సియాచిన్ సమీపంలో.. పీవోకేలో రోడ్డు నిర్మాణం

n శాటిలైట్ చిత్రాల ద్వారా వెలుగులోకి

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: డ్రాగన్ దేశం చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగుతోంది. కశ్మీర్‌లోని సియాచిన్‌కు సమీపంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో రోడ్డు నిర్మాణం చేపడుతోంది. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ విడుదల చేసిన శాటిలైట్ చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది. గతేడాది జూన్ ఆగస్టు మధ్య ఈ రోడ్డు నిర్మాణం చేపట్టినట్టు తెలుస్తోంది. దీంతో మరోసారి భారత్‌తో చైనా కయ్యానికి కాలు దువ్వుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్తాన్ షాక్స్‌గామ్ లోయను పాకిస్తాన్ 1963లో చైనాకు ధారాదత్తం చేసింది. చైనా జింజియాంగ్‌లోని జీ జాతీయ రహదారి సియాచిన్‌కు 50 కిలోమీటర్ల ఉత్తరాన ముగుస్తుంది. 

అయితే అగిల్ పాస్ వద్ద చైనా కొత్తగా రోడ్డు నిర్మించిందని గుర్తించారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తిగా అక్రమమని, దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందని భారత ఆర్మీ మాజీ కమాండర్ రాకేశ్ శర్మ అభిప్రాయపడ్డారు. సియాచిన్‌కు సమీపంలో చైనా రోడ్డు నిర్మిస్తున్నదనే విషయాన్ని తొలిసారిగా నేచర్ దేశాయ్ పేరుతో ఉన్న ట్విట్టర్ యూజర్ వెలుగులోకి తీసుకొచ్చారు.