04-05-2024 12:10:40 AM
న్యూఢిల్లీ, మే 3: బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ ‘ఆస్ట్రాజెనెకా’కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సదరు సంస్థ తయారు చేసిన ‘కొవిషీల్డ్’ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుని తమ కుమార్తె చనిపోయిందని మృతురాలి తండ్రి సుప్రీం కోర్టులో దావా వేశారు. 2021లో కొవిడ్ మహమ్మారి ఉధృతంగా ప్రబలుతున్నన్న సమయంలో భారత్‌కు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్‌ను తయారు చేశాయి. 2021లో ఆ వ్యాక్సిన్‌ను రితైక (19) అనే యువతి తీసుకు న్నది. వ్యాక్సిన్ తీసుకున్న నెల తర్వాత యువ తి తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. వైద్యులు ఆమెకు అనేక రకాల వైద్యపరీక్షలు చేసి ఆమె మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్ల మేటరీ సిండ్రోమ్‌తో బాధపడుతున్నదని నిర్ధారించారు. చికిత్స పొందుతూ రితైక కొద్దిరోజుల్లోనే చనిపోయింది.