calender_icon.png 11 July, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రసాయనశాస్త్రంలో చింతా శ్రీనివాసరెడ్డికి పీహెచ్‌డీ

10-07-2025 12:00:00 AM

పటాన్ చెరు, జులై 9 : హైదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి చింతా శ్రీనివాసరెడ్డి డాక్టరేట్ కు అర్హత సాధించారు. ఆర్పీ - హెచ్పీఎల్సీ ద్వారా ఫార్మాస్యూటిక్ డోసేజ్ ఫారమ్ ల అభివృద్ధి, ధ్రువీకరణను సూచించే విశ్లేషణాత్మక పద్ధతి స్థిరత్వం, క్యూబీడీ టెక్నిక్ ద్వారా దృఢత్వంపై అధ్యయనం చేసి సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.

ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం పూర్వ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేష్ కుమార్ కటారి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. డాక్టర్ శ్రీనివాసరెడ్డి అధ్యయనం తక్కువ డోస్ ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ల కోసం ఖచ్చితమైన, బలమైన, స్థిరత్వాన్ని సూచించే పద్ధతులను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది.

అంతర్జాతీయ ఐసీహెచ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఫార్మాస్యూటికల్ విశ్లేషణలో ఖచ్చితత్వం, నాణ్యత హామీని పెంపొందించడానికి ఈ అధ్యయనం దోహదపడుతుంది. ఈ సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఆయేషా బేగం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు అభినందనలుతెలిపారు.