calender_icon.png 11 July, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి వివేక్‌ను కలిసిన కార్మిక నాయకులు

10-07-2025 12:00:00 AM

పటాన్ చెరు, జులై 9 : రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వివేక్ వెంకటస్వామిని మాజీ ఎమ్మెల్సీ రాములుయాదవ్, జిల్లా కార్మిక నాయకుడు వరప్రసాద్ రెడ్డి బుధవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బొల్లారం మున్సిపాలిటీలోని హార్టెక్స్ రబ్బర్ పరిశ్రమలో ఇటీవల జరిగిన యూనియన్ ఎన్నికల్లో టీఆర్టీయూసీ ప్రెసిడెంట్ గా రాములునాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా వరప్రసాద్ రెడ్డి లు విజయం సాధించారు.

ఈ నేపథ్యంలో మంత్రి వివేక్  వెంకటస్వామిని మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. పరిశ్రమల్లో పని చేసే కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ జనరల్ సెక్రటరీ లఖన్ సింగ్, కార్మిక నాయకులు ఉద్యానంద్, ధర్మేందర్ యాదవ్, ఉమాకాంత్, తివారి, సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.