calender_icon.png 10 July, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల హక్కుల జోలికొస్తే ఖబర్దార్ మోదీ

10-07-2025 12:00:00 AM

సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ

చండూరు, జూలై 9 : కార్మికుల హక్కుల జోలికొస్తే ఖబర్దార్ మోడీ అని కార్మికులకు నష్టం కలిగించే4 లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం చండూరు మండల కేంద్రంలో అఖిలభారత సార్వత్రిక సమ్మె పిలుపుమేరకు సిఐటియు,  ఆధ్వర్యంలో చండూర్ మార్కెట్ యార్డ్ నుండి చండూరు చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి. రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజల కష్టార్జితంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్ప చెప్పవద్దని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులకు 10 గంటలు పని చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. 

కార్యక్రమంలో సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనంజయ, సిఐటియు సీనియర్ నాయకులు మోగుదాల వెంకటేశం, చిట్టిమల్ల లింగయ్య,బి ఆర్ టి యు చండూర్ టౌన్ అధ్యక్షులు చొప్పరి దశరథ, గ్రామపంచాయతీ యూనియన్ మండల ప్రధాన కార్యదర్శి నాంపల్లి శంకర్, పుష్పలత, నాగిల్ల లక్ష్మయ్య, కృష్ణయ్య, యాదయ్య, బిక్షమయ్య,మున్సిపల్ యూనియన్ జిల్లా నాయకులు కత్తుల Saidulu, Bipangi Nagaraju, Irigi Yadagiri, Nallaganti Lingaswamy, Kalamma, Renuka, and ASHA Workers Union leaders Katta Padma తదితరులు పాల్గొన్నారు.