30-10-2025 06:51:10 PM
నకిరేకల్ (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను అధిక మెజార్టీతో గెలిపించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గురువారం జూబ్లీహిల్స్ బోరబండ డివిజన్ లోని 314, 315, 316 బూత్ లలో ఇంటింటికీ వెళ్లి ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.