30-10-2025 08:47:26 PM
న్యూడెమోక్రసీ..
కొత్తగూడెం (విజయక్రాంతి): రిజిస్ట్రేషన్ పేరుతో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని నిలుపుదల చేయటం సరైనది కాదని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఇందిరమ్మ ఇండ్ల పట్టాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాల్వంచ పట్టణంలోని వనమా కాలనీ,ఇందిర కాలనీ, వెంగళరావు కాలనీ,వికలాంగుల కాలనీ,శివనగర్,హమాలి కాలనీ,నెహ్రు నగర్ మిగతా పట్టణంలోని కాలనీలలో రెండు నెలల కిందట ఇందిరమ్మ పట్టాలు ఇచ్చి, ఇప్పుడు రిజిస్ట్రేషన్ లేవని ఆపడాన్ని సరైంది కాదన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ తాతల ముత్తాతలు నుండి కాలనీలో నివాసం అంటూ ఇంటి పన్నులు కట్టుకుంటూ కరెంటు బిల్లు, పంపు బిల్లు చెల్లిస్తూ నివాసం ఉంటున్న వారిని ప్రభుత్వం గుర్తించి ఇందిరమ్మ ఇల్లు పట్టాలు మంజూరు చేశారన్నారు. సంతోషంతో వారంతా ఇళ్లను కూలగొట్టుకొని కిరాయిలు కట్టలేక,రెండు రేకులు వేసుకొని నివాసం ఉంటూ ముగ్గులు పోసుకున్నాక ఇప్పుడు ఇది ఏజెన్సీ ప్రాంతం రిజిస్ట్రేషన్లు లేవు అని చెప్పడం లబ్ధిదారులందరూ కన్నీరు మున్నీరై విలపిస్తున్నారన్నారు, ఇందిరమ్మ ఇల్లు పట్టా ఇచ్చేటప్పుడు ఇందిరమ్మ పట్టాలో లేని నిబంధనలు మా ఇల్లులు కూలగొట్టుకున్నాక రోడ్డు మీద పడ్డాక, నిబంధనలు గుర్తుకొచ్చాయా అని ఆయన ప్రశ్నించారు.. తక్షణమే పాత పద్ధతిలోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ముగ్గులు పోయించిన వాటికి బిల్లులు సాంక్షన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు..ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పట్టణ నాయకులు ఎల్ నరేష్,లబ్ధిదారులు కొమరం మల్లేష్,మోటం మహేష్,వెంకట్,సాంసన్, అంజలి, విజయలక్ష్మి, సతీష్, సాగర్, జీవన్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.