calender_icon.png 30 October, 2025 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలేటి లింగమ్మ దశదినకర్మకు మంద కృష్ణ మాదిగ హాజరు

30-10-2025 06:57:18 PM

నకిరేకల్ (విజయక్రాంతి): పవన్ సాయి హాస్పిటల్ అధినేత డా. అలేటి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి ఆలేటీ లింగమ్మ దశదినకర్మ కార్యక్రమం గురువారం శాలిగౌరారం మండల కేంద్రంలోని జీబిఎం గార్డెన్ లో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ లింగమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోవిందు నరేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోడ సునీల్, ఎంఎస్పి రాష్ట్ర నాయకులు మేడి శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరసాని గోపాల్, శాలిగౌరారం మండల ఇన్చార్జి కారుపాటి అంబేద్కర్, బట్ట శ్రీను, మాచర్ల ప్రతాప్, బాకీ వెంకన్న, బోడ వినోద్ తదితరులున్నారు.