30-10-2025 08:37:12 PM
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ అమరావతి నగర్ 100 ఫీట్ల రోడ్డులో మొంథా తుఫాన్ కారణంగా నిరాశ్రయులైన ప్రజలకు సాయంగా గురువారం క్రెడాయి వరంగల్ అధ్యక్షుడు నాయిని అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తమ సిఎస్‌ఆర్ నిధుల ద్వారా సుమారు 1,500 మందికి అన్నం ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. 100 ఫీట్లరోడ్ (శ్యామల గార్డెన్స్), పోతననగర్ ప్రాంతాల్లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో కష్టాల్లో ఉన్న బాధితులకు ఈ సహాయం అందించడం ద్వారా క్రెడాయి వరంగల్ సభ్యులు తమ సామాజిక బాధ్యతగా అండగా నిలిచామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ శాఖమూరి అమర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు చైర్మన్ తిరుపతి రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిహెచ్ సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎల్. రజనీకాంత్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు కొండా రెడ్డి, నాగరాజు, వెంకట మల్లా రెడ్డి, కోశాధికారి వరుణ్ అగర్వాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం. రాజ్‌కుమార్, కార్యవర్గ సభ్యులు మనోహర్, బాబు రావు, క్రెడాయ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.