30-10-2025 08:50:32 PM
టేకులపల్లి (విజయక్రాంతి): మొంథా తుపాను కారణంగా తడిసి ముద్దయిన పత్తి, నేలకొరిగిన మిరప, మొక్కజొన్న, వరి ధాన్యం పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ టేకులపల్లి మండల కార్యదర్శి బోడ బాలు డిమాండ్ చేశారు. గురువారం ఆయన మండలంలోని వరి, పత్తి, మిరప, మొక్కజొన్న పొలాలను ఆయన పరిశీలించారు. వర్షాల కారణంగా రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. వెంటనే వ్యవసాయాధికారులు మండలంలోని పంటలను పరిశీలించి నష్టం అంచనా వేసి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.