05-08-2025 12:00:00 AM
అడిషనల్ కలెక్టర్ రేవయ్య
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆగస్టు ౪ (విజ యక్రాంతి):విద్యార్థి దశ నుండే లక్ష్యాన్ని ఎం చుకొని ముందుకు సాగాలని సాంఘిక సంక్షే మ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థి, మహారాష్ట్రంలోని ఉస్మానాబాద్ అడిషనల్ కలెక్టర్ రేవయ్య అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పూర్వ విద్యార్థి రేవయ్యను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఐఏఎస్ రేవయ్య మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో చదివి సివిల్స్ ర్యాంకు సాధించి మహారాష్ట్రలో అడిషనల్ కలెక్టర్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు.శ్రద్ధతో చదివితే లక్ష్యాన్ని చేదించడం కష్టతరం కాదని విద్యార్థులకు సూచించారు.ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్య అందుతుందని ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను ఏకాగ్రతతో విన్నాలని సూచించారు.భవిష్యత్తులో ఉన్నత స్థానం చేరుకోవాలంటే విద్యతోనే సాధ్యమవుతుందని అన్నారు.
చదువు అంటే భయం ఉండవద్దని అప్పుడే ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నారు.ఎంతో కష్టపడి చదివిపిస్తున్న తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత పిల్లలపై ఉంటుందని తెలిపారు.ఈ పాఠశాలలో చదివి ఇప్పుడు విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇవ్వడం గర్వంగా ఉందన్నారు.
నాకు విద్య బుద్ధులు చెప్పిన గురువులకు పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ యాదగిరి, సిబ్బంది మహేష్ చంద్ర, రమేష్ తదితరులు పాల్గొన్నారు.