05-08-2025 12:00:00 AM
ఎస్పీ కాంతిలాల్ పాటిల్
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆగస్టు ౪ (విజ యక్రాంతి): శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నా రు. ఇటీవల జిల్లాకు బదిలీపై వచ్చిన సిఐ లు బాలాజీ వరప్రసాద్ ,సంజయ్ సోమవారం ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయ డంతో పాటు నేరాల నియంత్రణ నిషేధిత పదార్థాల రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలీస్ శాఖపై ప్రజ లకు మరింత నమ్మకం కలిగేలా పనిచేయాలని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఎస్పీ తన కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.బాధితులు మధ్యవర్తుల మాటలు నమ్మి మోస పోవద్దని నేరుగా పోలీసులను ఆశ్రయించాలని ఎస్పీ సూచించారు. ఇటీవల సికింద్రా బాద్లో జరిగిన అథ్లెటిక్ పోటీలలో పరుగు పందెంలో మొదటి స్థానంలో నిలిచిన దంపతులు ఆనంద్ రావు, శకుంతలను ఎస్పీ అభినందించారు.