calender_icon.png 25 December, 2025 | 10:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోట పబ్లిక్ స్కూల్‌లోక్రిస్మస్ సంబురాలు

25-12-2025 02:36:34 AM

కరీంనగర్ (రేకుర్తి), డిసెంబర్ 24(విజయక్రాంతి): కరీంనగర్‌లోని రేకుర్తి ప్రాంతం లో గల కోట పబ్లిక్ స్కూల్ కేంద్ర కార్యాలయంలో ముందస్తు క్రిస్మస్ సంబరాలు బు ధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోట పబ్లిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ డి. అంజిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, కరుణ, సేవాభావాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు.

యేసుక్రీస్తు బోధించిన సత్యం, త్యాగం, మానవతా విలువలు విద్యార్థుల జీవితాలకు మార్గదర్శకంగా నిలవాలని ఆ కాంక్షించారు. విద్యార్థులు క్రిస్మస్కు సంబంధించిన పాటలు, నృత్యాలు, నాటికలు ప్రద ర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.