25-12-2025 02:35:37 AM
హైదరాబాద్, డిసెంబర్ 24: చైతన్యపురిలోని ప్రాణహిత హాస్పిటల్ ఆవరణలో సెమీ క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పండుగ వాతావరణం ఉట్టిపడేలా ఆసుపత్రి ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, క్రిస్మస్ ట్రీలతో సుందరంగా అలంకరించారు.హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ రెడ్డి, ప్రముఖ వైద్యు లు అశోక్ కుమార్,అనిల్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి వేడుకల ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండుగలు మనలో స్నేహభావాన్ని, సోదరభావాన్ని పెంపొందిస్తాయని, అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు మానసిక ఉల్లాసాన్ని అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.వేడుకల్లో భాగంగా ఆసుపత్రి యాజమాన్యం రోగులకు, వారి సహాయకులకు ప్రత్యేక బహుమతులను పంపిణీ చేసింది. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య బృందం, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.