25-12-2025 02:37:19 AM
నిజామాబాద్ లీగల్ కరస్పాండెంట్ డిసెంబర్ 24 (విజయక్రాంతి): నిజామాబాద్ భారత ప్రభుత్వం స్టాండింగ్ కౌన్సిల్ గా నిజామాబాద్ సీనియర్ న్యాయవాది చింతకుంట సాయి రెడ్డి అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ గా సీనియర్ న్యాయవాదులు బండారి కృష్ణ ఆనంద్, మల్లెపూల జగన్మోహన్ గౌడ్, దయవార్. నాగేశ్వర్, ఆకుల. సురేష్, పపడిగేల వెంకటేశ్వర్, టి నరసింహారెడ్డి, రుయాడి. రాజేశ్వర్ గార్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వ న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వీరు నిజామాబాద్ జిల్లా లో కేంద్ర
ప్రభుత్వం సంబంధించిన పెండింగ్ లో ఉన్నటువంటి కోర్టు కేసులను పరిష్కరించడంలో ప్రభుత్వం తరఫున వాదించడం జరు గుతుంది. వీరు మూడు సంవత్సరాలు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పదవిలో కొనసాగుతారని న్యాయ మంత్రిత్వ శాఖ సెక్రెటరీ ఉత్తర్వులు లో పేర్కొన్నారు. నిజామాబాద్ న్యాయవాదులకు ఈ అవకాశం దక్కడం పట్ల న్యాయవాదులు అభినందిస్తూ శుభాకాంక్షలుతెలిపారు.