24-08-2025 12:34:28 AM
హైదరాబాద్, ఆగస్టు23(విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పెద్ద అల్లుడు పునీత్ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసిం ది. పునీత్ ఐవీ గ్రీన్ ఇన్‌ఫ్రా కంపెనీ నిర్వహిస్తున్నాడు. పునీత్ పేరుతో తన అకౌంటెంట్‌కు సైబర్ కేటుగాళ్లు మెసేజ్ చేశారు. అత్యవసరంగా రూ. 1.96 కోట్లు కావాలం టూ.. అకౌంట్‌కు డబ్బులు పంపమని మెసేజ్ పంపారు.
అకౌంటెంట్ నిజమనుకొని వెంటనే ఆ డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత మోసపోయిన ట్లు గ్రహించిన అకౌంటెంట్ వెంటనే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని సైబర్ నేరగాళ్లను ట్రేస్ చేసి పట్టుకున్నారు. యూపీకి చెందిన సంజీవ్, అరవింద్ అనే వ్యక్తులు సైబర్ నేరానికి పాల్పడినట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో రూ.1.40 కోట్లు ఫ్రీజ్ చేశారని చెబుతున్నారు. కాగా మంత్రి అల్లుడిని సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేయడం సంచలనంగా మారింది.