calender_icon.png 12 December, 2025 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడ్చల్ జిల్లా మున్నూరు కాపు సంఘం నూతన అధ్యక్షుడిగా వేల్పుల శ్రీనివాస్

12-12-2025 08:09:05 PM

శామీర్ పేట్: మేడ్చల్ జిల్లా మున్నూరు కాపు సంఘం ఎన్నికలు శుక్రవారం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శుభం గార్డెన్ లో మామిండ్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘం రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థానంలో నిలవాలని, రాజకీయాలలో ఇప్పుడు జరుగుతున్న 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీలందరూ ఏకమై సాధించుకోవాలని ఆయన తెలిపారు.

మేడ్చల్ జిల్లా నూతన అధ్యక్షుడిగా వేల్పుల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని. మున్నూరు కాపు సంఘం అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతూ అందరి మన్నలలను పొందుతానని ఆయన అన్నారు. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన చాట్లపల్లి నర్సింగరావు మాట్లాడుతూ నన్ను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ఆయన అన్నారు.