calender_icon.png 14 August, 2025 | 2:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మునిపల్లి మండలంలో భారీ వర్షం

14-08-2025 12:11:41 AM

మునిపల్లి, ఆగస్టు 13 : గత వారం రోజులగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మునిపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఇందులో భాగంగానే మండలంలోని అంతారం, చిన్నచెల్మెడ  గ్రా మాల మధ్య ఉన్న వాగు వరద నీటి తో పొంగుతుంది.

దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కంకోల్ నుంచి వస్తున్న ప్రయాణికులు వాగు దాటేందుకు ఇబ్బందులు పడుతున్నారు. నీరు ఉదృతి తగ్గే వరకు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది.  బొడ్షట్పల్లి - లింగంపల్లి గ్రామాల మధ్య ఉన్న వంతెనపై వరద నీరు పొంగిపొర్లుతుంది.  దీంతో అటు ప్రయాణికులకు ఇటు ప్రజలకు తీవ్ర ఇబ్బందులుతప్పడంలేదు.