బాధ్యతలు చేపట్టిన పట్టణ సీఐ నరహరి
పట్టణ ప్రజలు ప్రశాంతతకు సహకరించాలి
పట్టణ ఎస్ హెచ్ ఓ నరహరి
కామారెడ్డి, జూన్ 27 (విజయ క్రాంతి), కామారెడ్డి పట్టణ ఎస్ హెచ్ ఓ గా నరహరి శుక్రవారం బాధ్యతలను చేపట్టారు. బదిలీపై వెళ్లిన సి ఐ చంద్రశేఖర్ రెడ్డి నుంచి బాధ్యతలను స్వీకరించారు. కామారెడ్డి పట్టణం ప్రశాంత వాతావరణంలో ఉండే విధంగా ప్రతి ఒక్కరూ పట్టణ ప్రజలు నాయకులు, అధికారులు, ప్రజలు సహకరించాలని కోరారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి ,మత్తు , గుట్కాలాంటి మత్తు పదార్థాలను విక్రయించవద్దని ఆయన కోరారు. పోలీసులకు పట్టణ ప్రజలు సహకరించాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు
. ప్రతి వీధిలో సీసీ కెమెరాలు ఉండేవిధంగా వ్యాపారులు సహకరించాలని ఆయన కోరారు. పట్టణ ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా తమ దృష్టికి తీసుకురావచ్చు అని ఆయన తెలిపారు. కామారెడ్డి పట్టణం శాంతియుతంగా ఉండే విధంగా దొంగతనాల నివారణ కు ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.






