calender_icon.png 25 October, 2025 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జడ్చర్ల కాంగ్రెస్‌లో అంతర్యుద్ధం

25-10-2025 12:00:00 AM

- ఎమ్మెల్యే సొంత మండలం అధ్యక్షుడే తిరుగుబాటు

- దుష్యంత్ రెడ్డి సస్పెన్షన్ ప్రకటనపై తీవ్ర చర్చ 

- టిపిసిసి కో ఆర్డినేటర్ ధార భాస్కర్ బహిరంగ విమర్శలు

- హాట్ టాపిక్ ఆ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి 

- మొదటినుంచి సంచలన ప్రకటనలు చేస్తూ వస్తున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి 

- మైకు పట్టిండంటే... యావత్తు తెలంగాణ వినవలసిందే అనేలా సూటి ప్రశ్నలు

మహబూబ్ నగర్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): జడ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ లో అంతర్యుద్ధం బహిర్గతమవుతుంది. అంతర్లీనంగా పార్టీ వ్యవహారాలలో పలు సందేహాలు, అసంతృప్తులు ఉండడం సర్వసాధారణం. ఒక ఇంటిలో జీవించే కుటుం బంలోని నలుగురు వ్యక్తులే అసహనం వ్య క్తం చేసుకుంటున్న చర్చ చుట్టుపక్కల వారికి చర్చనీయాంశంగా మారడం మామూలే. కాగా అది ఇల్లు చర్చ ఆ చుట్టుపక్కల వారికి పరిమితం అవుతుంది.... కాగా ఇక్కడ అట్లా కాదు కదా.. ప్రజా పాలన ప్రభుత్వంలో జ డ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేక చర్చకు దారితీస్తుంది.

మొన్నటివరకు జడ్చర్ల ఎమ్మెల్యే అ నిరుద్ రెడ్డి ఏది మాట్లాడినా సంచలనమే. ఇక్కడి వరకు జడ్చర్ల ఎమ్మెల్యే పలు సందర్భాలలో సొంత పార్టీ నేతలపై కూడా ఇలా చేయాలి అలా చేయాలి అంటూ బహిరంగంగానే ప్రకటన చేశారు. ఇటీవల పోలేపల్లి సెజ్ లోని ఓ కంపెనీ నుంచి కంపెనీ విడుదల చేసిన విషపూరితమైనటువంటి నీరు పంట పొలాలకు చేరి పంటలు పండకుండా జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఒక్కరోజులో స్పందించకుంటే ఆ కంపెనీని తగలబెడతానని ఎక్కడ ఏ ఎమ్మెల్యే చేయని ప్రకటన చేశారు.

ఎమ్మెల్యే ఆ మేరకు స్పం దించారని లేక మరే ఇతర కారణము తెలియదు కానీ నిర్ణీత సమయంలోనే పొల్యూ షన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు ఆ కంపెనీ కీ చేరుకొని తనిఖీలు చేపట్టి శాంపుల్స్ కూ డా సేకరించారు. ఇలా ఒక్కటి కాదు ప్రతి వి షయంలోనూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీరే వేరు అనే విధంగా చర్చకు దారి తీసి న అంశాలే అత్యధికంగా ఉన్నాయని పార్టీ నాయకులతో పాటు జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు చెబుతున్న మాట.

- తెరపైకి ఎమ్మెల్యే సోదరుడు దుష్యంత్ రెడ్డి..

 జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నిత్యం సంచలన ఆరోపణలు చేస్తూ మీడియాలో మొదటి పేజీ వార్తగా నిలుస్తున్నారు. ఈ అం శాలు కూడా మాలు మూడు అంశాలు ఏమి కావు ప్రతి అంశము సంచలనమే అయినా చర్చ జడ్చర్ల నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు సాగుతుందని పార్టీలోని కొందరు నాయకులు చర్చకు దారి  తీస్తున్నారు.

ఇది ఇలా ఉండగానే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సోదరుడు దుష్యంత్ రెడ్డి పై కాంగ్రెస్ నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కనీస విలువలు లేకుండా మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్యే సొంత మండలమైన రాజపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తెర కృష్ణయ్య ఎమ్మెల్యే సోదరుడు దుష్యంత్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఒక ప్రకటనను విడుదల చే శారు. ఎమ్మెల్యే సొంత సోదరుడు దుష్యంత్ రెడ్డి కావడంతో ఒక మండల అధ్యక్షుడు ఎ మ్మెల్యే సోదరుడిని సస్పెండ్ చేయడం ఏం టి అనే చర్చ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగింది. అసలు ఈ సస్పెండ్ చెల్లుతుందా? చెల్లదా?అనే సందేహం కూడా చర్చకు దారి తీస్తుంది. 

- పెరుగుతున్న అసంతృప్తి...

 జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో రోజురోజుకు అసంతృప్తి పెరుగుతుందని ప్రత్యే కంగా చెప్పక్కర్లేదు. ఇటీవల ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టిపిసిసి కోఆర్డినేటర్ ధార భాస్కర్ తనను మానసికంగా ఎ న్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారని దుష్యం త్ రెడ్డి తన తీరును మార్చుకోవాలని  కోరారు. తనతో ఎవరు మాట్లాడిన వారిని దూరం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నిరంతరం పనిచేశామని పేర్కొన్నారు. దుష్యంత్ రెడ్డి పై టీపీసీసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్న సమయంలో జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాడర్ ఎవరికి వారే అనేలా ఉండ డం నిజమైన కాంగ్రెస్ వాదులకు మింగుడు పడని అంశంగా ఆవేదనకు గురిచేస్తుంది. ఇక మీదట పార్టీ క్యాడర్ ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సమాచారం లేదు..

 జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సోదరుడు దుష్యంత్ రెడ్డి ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం నాకు ఎలాంటి స మాచారం లేదు. పూర్తిస్థాయిలో సమాచారం సేకరించడం జరుగుతుంది. అన్ని విషయాలు తెలుసుకుంటాను. 

 మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే


పార్టీకి చెడ్డ పేరు తెస్తే ఎలా...కాంగ్రెస్ నేతలు

 కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. పార్టీ నియమ నిబంధనలకు లో బడి పార్టీ సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నాం. ఎమ్మెల్యే సోదరుడు దు ష్యంత్ రెడ్డి ఇందుకు విరుద్ధంగా పనిచేస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. తనపై వ్యక్తిగతంగా కూడా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పార్టీ నియమ ని బంధనలను పాటించకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయడం ఏంటి ? ఇది ఎం తవరకు సమంజసం అంటూ పార్టీ లైన్ దాటారు కాబట్టి సస్పెండ్ చేస్తూ ప్రకటన జారీ చేయడం జరిగింది. వాస్తవా లను పార్టీ పెద్దల ముందు ఉంచుతాను. 

 కత్తెర కృష్ణయ్య, రాజాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మహబూబ్ నగర్ జిల్లా