calender_icon.png 25 October, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణాలకు తెగించి మరమ్మతులు చేసిన విద్యుత్ సిబ్బంది

24-10-2025 11:49:28 PM

గజ్వేల్: ప్రాణాలను తెగించి విద్యుత్ సిబ్బంది విద్యుత్ ను పునరుద్ధరించారు. గజ్వేల్ మండలం బెజుగామ 11కేవీ ఫీడర్ నుంచి బెజుగామ, చిన్న ఆరెపల్లి, హసన్ మీరా పల్లి కి వెళ్లే విద్యుత్ డిస్క్ పాడవడంతో లైన్ మెన్ ప్రవీణ్, జేఎల్ఎం సత్యనారాయణ, గ్రామ సహాయకుడు రాజయ్య బెజుగామ తుర్కొనికుంట నుంచి ఈదుకుంటూ వెళ్లి ప్రాణాలకు తెగించి డిస్క్ ను మర్చారు. దీంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరిగింది. ఈ విషయం తెలిసిన డీఈ బానుప్రకాశ్, ఏడీ జగదీశ్ ఆర్య, ఏఈ మారుతి వారిని అభినందించారు.