18-12-2025 02:13:52 AM
పెన్షనర్ డే సందర్భంగా యూనివర్సిటీ రిటైర్డ్ ఉద్యోగుల డైరీ ఆవిష్కరణ
హనుమకొండ, డిసెంబర్ 17 (విజయ క్రాంతి): రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. పెన్షనర్స్ డే సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో సెనేట్‌హాల్‌లో నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో ముఖ్య అతిథులుగా వైస్ ఛాన్సలర్ ప్రతాప్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు గౌరవంగా ఉందని, సేవలో ఉన్న రోజుల్లో సంస్థకు ఇచ్చిన కృషి ఇప్పటికీ కనిపిస్తోందని, ఈ విశ్వవిద్యాలయానికి ఉన్న గౌరవం, ప్రమాణాలు ఉద్యోగుల శ్రమ ఫలితం అన్నారు. పదవీ విరమణతో బాధ్యతలు ముగిసినా, అనుభవం ముగియదన్నారు. సమాజానికి రిటైర్ ఉద్యోగులే మార్గదర్శకులన్నారు.
త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాకతీయ యూనివర్సిటీ కి నిధులు కేటాయించేలా జిల్లా ప్రతినిధులందరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఇటీవలే ఓయు అభివృద్ధి కి భారీ స్థాయిలో నిధులు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తంచేశారు.
అనంతరం కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం డైరీ ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు చిర్ర రాజు గౌడ్, పల్లకొండ సతీష్,రిటైర్డ్ ప్రొఫెసర్ల సంఘ అధ్యక్షులు సదానందం,కార్యదర్శి వడ్డే రవీందర్,రామిరెడ్డి,వీరన్న,కూరపాటి వెంకటనారాయణ, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.