calender_icon.png 11 February, 2026 | 4:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ - బిఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వివాదం

11-02-2026 12:41:40 PM

10వ వార్డులో బాహాబాహి

షాద్‌నగర్,(విజయక్రాంతి): ఫరూఖ్ నగర్  పట్టణంలోని పదవ వార్డులో కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకుల మధ్య స్వల్ప  వాగ్వివాదం చోటుచేసుకుంది.ఓటింగ్ నెపద్యములో  పదో వార్డు వద్ద కాంగ్రెస్ నాయకులు జమ్రద్ ఖాన్ వర్గం, పిల్లి శేఖర్ వర్గాలకు చెందిన కార్యకర్తలు పోలింగ్ కేంద్రం నిషేధాజ్ఞల వెలుపల ఓటర్ల విషయంలో జోక్యం చేసుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాట పెరిగి వివాదానికి దారితీసింది. అక్కడే బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది వారిని నిలువరించే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు జమృత్ ఖాన్, 11వ వార్డు టిఆర్ఎస్ నాయకుడు పిల్లి శేఖర్ సంఘటన స్థలం వద్ద గట్టిగా అరవడంతో అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఏసీపి లక్ష్మీనారాయణ, పట్టణ సిఐ విజయకుమార్ ఇరువర్గాలను అక్కడి నుండి చెదరగొట్టారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. శాంతిభద్రతలకు ఎవరైనా ఆటగాం కల్పించాలని చూస్తే ఎవరిని ఉపేక్షించమని ఎసిపి లక్ష్మీనారాయణ హెచ్చరించారు.